వెంకటాపురం మండలం చాతారాజుపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణపతి మంటపం వద్ద మహిళలు కుంకుమ పూజలు మంగళవారం చేశారు. మహా అన్నదాన దాత, నాలుగవ వార్డ్ సభ్యుడు కచ్చాకాయల నితీష్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వెంకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ చల్ల రాజు మహా అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించి, గణపతి దేవునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలతో మాట్లాడారు. ఆలయ కమిటీ సభ్యులు ఎస్ఐ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి పవన్, వార్డ్ సభ్యులు మహ్మద్ అస్లాం పాషా, కచ్చాకాయల నితీష్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.