ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా లెనిన్ వత్సల్ టోప్పోను ప్రభుత్వం నియమించింది. గతంలో ఇక్కడ పనిచేసిన చిత్రమిశ్రా కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ములుగు కలెక్టర్ దివాకర్ టీఎస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహించారు. మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్న లెనిన్ వత్సల్ టోప్పోను ఇప్పుడు పీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.