కారును ఢీకొన్న లారీ.. మల్లంపల్లిలో ట్రాఫిక్ జామ్

7చూసినవారు
ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు సాంకేతిక కారణాలతో ఆగిపోగా, వెనుక వచ్చిన కారును అదుపుతప్పిన లారీ ఢీకొట్టింది. దీంతో కారు రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయి ధ్వంసమైంది. అదృష్టవశాత్తు కారులో ఉన్నవారు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై చాలాసేపు వాహనాలు నిలిచిపోయి, మేడారం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ట్యాగ్స్ :