మంగపేట బస్టాండ్ ని వెంటనే అందుబాటులోకి తేవాలి

9చూసినవారు
మంగపేట బస్టాండ్ ని వెంటనే అందుబాటులోకి తేవాలి
మంగపేటలో దశాబ్దాల కల అయిన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం అధికారుల, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రెండేళ్లుగా పూర్తికాక ప్రయాణికులు అల్లాడుతున్నారు. రోడ్డు కంటే బస్టాండ్ ప్రాంగణం పల్లంగా ఉండటంతో ముంపు ప్రమాదం పొంచి ఉంది. నాణ్యమైన మొరానికి బదులు పొలాల మట్టి వాడటం, కనీసం మరుగుదొడ్ల వసతి కూడా కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాసిరకం పనులపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని, బస్టాండ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్