మేడారం జాతర.. నేడు వనప్రవేశంతో ముగింపు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో చివరి ఘట్టమైన వనప్రవేశం నేడు జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య బృందం గద్దెల వద్ద రహస్య పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తుల దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు ముగించి, తల్లి రూపమైన కుంకుమ భరిణెను తీసుకుని పూజారులు చిలుకలగుట్టకు బయలుదేరుతారు. దీంతో నాలుగు రోజుల పాటు వైభవంగా సాగిన గిరిజన కుంభమేళాకు తెరపడనుంది.
