మేడారం జాతర.. మాంసం, మద్యానికి రూ.400 కోట్లు!

14చూసినవారు
మేడారం జాతర.. మాంసం, మద్యానికి రూ.400 కోట్లు!
నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగిన మేడారం జాతరలో భక్తులు సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా కోటిన్నర మంది భక్తులు 14 లక్షల గొర్రెలు, మేకలు, కోళ్లను బలిచ్చినట్లు తెలుస్తోంది. మద్యం కోసం రూ.10 కోట్లు, మాంసం, మద్యం కలిపి రూ.400 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. అలాగే కోటికి పైగా కొబ్బరికాయలు, 500 టన్నుల బెల్లం, చీరలు, గాజులు వంటి వాటితో పెద్దఎత్తున వ్యాపారం జరిగినట్లు అంచనా.

సంబంధిత పోస్ట్