మేడారం సమ్మక్క-సారలమ్మ ఉత్సవాలను కేవలం జాతరగా కాకుండా తెలంగాణ గుండె చప్పుడుగా ప్రపంచానికి చాటి చెప్పాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మేడారంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం శాశ్వత పనులు చేపట్టి కోట్లాది భక్తులకు ఇబ్బందులు లేకుండా చేస్తుందని తెలిపారు. జాతరకు రూ. 150 కోట్లు, శాశ్వత పనులకు రూ. 101 కోట్లు కేటాయించామని, జాతరలో చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించామని ఆయన పేర్కొన్నారు.