మేడారం జాతర చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతమైందని మంత్రి సీతక్క ప్రకటించారు. తల్లుల వన ప్రవేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో కోట్లాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. సీఎం సహకారంతో 100 రోజుల్లోనే అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. దుష్ప్రచారాలను తిప్పికొట్టి భక్తులు తల్లులను దర్శించుకున్నారని, ఈ విజయంలో భాగస్వాములైన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.