మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. దీంతో తాడ్వాయి–మేడారం రహదారిపై దాదాపు 8 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో రద్దీ విపరీతంగా పెరిగింది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి తీసుకురాగా, గురువారం రాత్రి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చారు. అమ్మవారికి మంత్రులు, అధికారులు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు.