మేడారం మహాజాతర.. మూడో రోజు కొనసాగుతోన్న భక్తుల రద్దీ

5చూసినవారు
మేడారం మహాజాతర.. మూడో రోజు కొనసాగుతోన్న భక్తుల రద్దీ
తెలంగాణలోని మేడారంలో మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మేడారం జనసంద్రంగా మారింది. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీతో రహదారులన్నీ కిటకిటలాడుతున్నాయి.

సంబంధిత పోస్ట్