మేడారం: గద్దె పైకి చేరుకున్న సమ్మక్క తల్లి
By sunitha 2చూసినవారుమేడారం మహా జాతరలో వనదేవత సమ్మక్క తల్లి భక్త జనంలోకి అడుగుపెట్టింది. చిలకలగుట్ట పైనుండి పూజారులు సమ్మక్కను కిందికి తీసుకురాగా, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలికారు. రాత్రి 8:30 గంటలకు సమ్మక్క మేడారంలో గద్దెలపైకి చేరుకున్నారు. కొమ్ము నృత్యాలు, గుస్సాడీ, ధింసా నృత్యాలతో అమ్మవారిని గద్దెల వద్దకు తీసుకువచ్చారు. ప్రస్తుతం భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రేపు భక్తులకు దర్శనం ఇచ్చి, ఎల్లుండి సమ్మక్క, సారలమ్మలు వన ప్రవేశం చేస్తారు.