ములుగు జిల్లా మేడారం జాతరలో అత్యవసర వైద్య సేవల కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకలతో శ్రీ సమ్మక్క, సారలమ్మ పేరిట ప్రధాన ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నారు. అలాగే జంపన్న వాగు, ఇంగ్లిష్ మీడియం స్కూల్ వద్ద 6 పడకల సామర్థ్యంతో రెండు మినీ హాస్పిటళ్లు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు, భక్తులు వచ్చే 8 ప్రధాన రూట్లలో 42 ఎన్-రూట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు.