మేడారం జాతరకు తరలివచ్చిన కోట్లాది మంది భక్తులు మొబైల్ నెట్వర్క్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెల్ సిగ్నల్స్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా జియో నెట్వర్క్ పూర్తిగా డౌన్ అవ్వడం భక్తుల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతోంది. కుటుంబ సభ్యులను సంప్రదించలేక భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఎయిర్టెల్ సిగ్నల్స్ ఫోన్లలో కనిపిస్తున్నప్పటికీ, కాల్స్ కనెక్ట్ కావడం లేదని భక్తులు తెలిపారు.