మేడారంలో రెండు రోజుల పాటు భక్తులను అలరించిన వరాల తల్లులు సమ్మక్క సారలమ్మలు ఇక సెలవంటూ వనబాట పట్టారు. మూడు రోజులుగా వైభవంగా జరిగిన మేడారం జాతర ముగిసింది. భక్తులు ఇంటి దారి పట్టగా, తల్లులు వన ప్రవేశం చేశారు. వడ్డెలను ఆవహించి తల్లుల దమ్ములను మోపడంలో మేడారం ప్రాంతం రెండు రోజుల పాటు ఉద్విగ్నంగా మారింది.