కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని సీపీఎం నాయకులు వెంకట్ రెడ్డి మంగళవారం పిలుపునిచ్చారు. ములుగులో మాట్లాడుతూ, లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక హక్కులను కుదిస్తున్నారని ఆయన విమర్శించారు. 'మే'డే సందర్భంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.