ములుగు: ఇక నుంచి నల్లా పన్ను నెలకు100

2చూసినవారు
ములుగు: ఇక నుంచి నల్లా పన్ను నెలకు100
ములుగు మున్సిపాలిటీలో ఇకపై నల్లా పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. మిషన్ భగీరథ పథకం అమలులో ఉన్నప్పటికీ, గ్రామాల్లో నల్లా పన్నులు విధించట్లేదు. అయితే, మున్సిపాలిటీలో మాత్రం నెలకు రూ. 100 చొప్పున పన్ను వసూలు చేయాలని తీర్మానించారు. ఇటీవల మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి తిరిగి నల్లాలపై సర్వే నిర్వహించారు. నీటి సరఫరా సరిగా లేని నల్లాలకు పన్ను విధించడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్