ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి నది ప్రస్తుతం వెలవెలబోతోంది. కొద్ది నెలల కిందట వరకు పరవళ్లు తొక్కుతూ కళకళలాడిన గోదావరి, ఇప్పుడు నీటి మట్టం తగ్గిపోవడంతో ఇసుక మేటలు, బండరాళ్లు బయటపడుతున్నాయి. ఎండల తీవ్రత పెరగడం, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో గోదావరి ప్రవాహం గణనీయంగా తగ్గినట్లు స్థానికులు చెబుతున్నారు. నది పరివాహక ప్రాంతాల్లో ఎడారి వాతావరణం కనిపిస్తోంది.