ములుగులో నాయీబ్రాహ్మణ సంఘం ములుగు పట్టణ కమిటీ నూతన కార్యవర్గాన్ని శనివారం స్థానిక బొడ్రాయి వద్ద జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిద్దెమీది సహదేవ్ అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల్లో ముత్యాల రాజు అధ్యక్షుడిగా, వేల్పుకొండ ముఖేష్ ప్రధాన కార్యదర్శిగా, రాంకోటి సహాయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని సభ్యులు ఆకాంక్షించారు.