పోచమ్మ గుడి పూజలో పాల్గొన్న ఎన్ఆర్ఐలు

6చూసినవారు
పోచమ్మ గుడి పూజలో పాల్గొన్న ఎన్ఆర్ఐలు
వెంకటాపురం మండలం చాతరాజుపల్లి గ్రామంలో శ్రావణమాసం సందర్బంగా పోచమ్మ గుడి పూజల్లో అమెరికా నుండి వచ్చిన ఎన్ఆర్ఐలు చాతారాజు అనిల్ బాబు, చాతారాజు సునీల్ బాబు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మామిడి పవన్, వార్డ్ మెంబెర్లు, మాజీ సర్పంచ్ చాతారాజు శ్రీధర్ రావు, గ్రామపెద్దలు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్ఆర్ఐ అనిల్ బాబు మాట్లాడుతూ, ఊరికి సేవచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అందరూ కలిసి పోచమ్మ గుడికి వెళ్లి గ్రామస్తులందరినీ చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్