ములుగు మండలం ఇంచర్ల గ్రామానికి చెందిన పారానందుల నర్సయ్య మంగళవారం తెల్లవారుజామున మొక్కజొన్న చేనులో నీళ్లు కడుతుండగా మొక్కజొన్న చేనులో చొరబడ్డ అడవి పంది ఒక్కసారిగా నర్సయ్యపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అరుపులు విన్న నర్సయ్య భార్య చూసి పక్కనే ఉన్న 39 సీఆర్పీఎఫ్ బెటాలియన్ వెళ్లి తెలుపగా సీఆర్పీఎఫ్ సిబ్బంది వచ్చి అతనిని కాపాడి ప్రథమ చికిత్స చేసి ములుగు ఏరియా హాస్పిటల్ కు తరలించారు.