మేడారం మహాజాతర ముగిసిన అనంతరం, వనదేవత సమ్మక్క భర్త పగిడిద్దరాజు తన స్వగ్రామం పూనుగొండ్ల వైపు ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ఆయన పరివారం గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంది. మరో రెండు గంటల్లో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పునుగొండ్లకు చేరుకోనున్న పగిడిద్దరాజుకు ఘనస్వాగతం పలికేందుకు భక్తులు, స్థానికులు సంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు ఆయనకు స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.