బస్సు అద్దాలు పగలగొట్టిన ప్రయాణికులు

4చూసినవారు
మేడారంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి తిరుగు ప్రయాణానికి ఒక్క బస్సు కూడా అందుబాటులో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్ వద్దనే నిరీక్షిస్తున్న ప్రయాణికులకు కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు బస్సు అద్దాలను పగులగొట్టారు.

సంబంధిత పోస్ట్