వంట కార్మికుల సమస్యలపై సీతక్కకు వినతిపత్రం అందజేత

9చూసినవారు
వంట కార్మికుల సమస్యలపై సీతక్కకు వినతిపత్రం అందజేత
ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మంత్రి దనసరి అనసూయ (సీతక్క)ను కలిసి వంట కార్మికుల సమస్యలపై గురువారం వినతిపత్రం అందజేశారు. పెండింగ్ అల్పాహార బిల్లులు విడుదల, రూ. 10 వేల వేతనం, కోడిగుడ్లు, నిత్యావసర వస్తువుల ప్రభుత్వ సరఫరా, కార్మికుల తొలగింపులు నిలిపివేయడం వంటి అంశాలను వారు ప్రస్తావించారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్