మల్లంపల్లి దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు ముగ్గురి అరెస్టు

8చూసినవారు
ములుగు జిల్లా మల్లంపల్లిలో జనవరిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రవి ఇంట్లో 65 గ్రాముల బంగారం, రూ. 35 వేల నగదు చోరీకి గురైన ఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఖానాపురానికి చెందిన నలుగురు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి, వారిలో బోడ గని, అల్వాల విపిన్, జబ్బ సిద్దును అరెస్టు చేశారు. వారి నుంచి 20.691 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you