శుక్రవారం రాత్రి నుండి శనివారం 5 గంటల వరకు మేడారం రోడ్డులో ట్రాఫిక్ తీవ్రంగా అస్తవ్యస్తంగా మారింది. అనుభవం లేని పోలీసు అధికారుల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, సరైన సీనియర్ అధికారులు, పోలీసు సిబ్బంది ఉంటే ట్రాఫిక్ సమస్యను అదుపు చేయగలిగేవారని పలువురు అభిప్రాయపడ్డారు. "ఒక బాధ్యతాయుత అధికారి ఇక్కడే ఉంటే బాగుండేది" అనే మాటలు వినిపించాయి. జాతరలో వీఐపీల ఆర్భాటం, పోలీసు పర్యవేక్షణ లోపం కలిసి భక్తుల సహనాన్ని పరీక్షించాయని వారు వాపోతున్నారు.