మేడారం వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం వివాదాస్పదమైంది. క్యూలైన్లలో తోపులాట జరిగిన సమయంలో భక్తులను నియంత్రించే క్రమంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గంటల తరబడి వేచి ఉన్న తమపై పోలీసులు ఇలా ప్రవర్తించడం సరికాదని, లాఠీలకు పని చెప్పడం ఎంతవరకు సబబు అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.