ములుగు మున్సిపాలిటీలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి: డివైఎఫ్ఐ

ములుగు మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి లైట్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని డివైఎఫ్ఎ మండల అధ్యక్షుడు రాజు బుధవారం ములుగులో అన్నారు. ప్రజలు ప్రాథమిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, డ్రైనేజీ లోపంతో మురికి నీరు నిల్వై వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైవే పక్కన ఫుట్పాత్లపై వ్యాపారాలు పెరగడంతో పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.