జర్నలిస్టుల సమస్యలపై ములుగులో నిరసన, కలెక్టర్‌కు వినతిపత్రం

4చూసినవారు
జర్నలిస్టుల సమస్యలపై ములుగులో నిరసన, కలెక్టర్‌కు వినతిపత్రం
ములుగు జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులు కలెక్టర్ కార్యాలయం నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. జర్నలిస్టుల సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. నూతన మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం, రద్దైన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాల ద్వారా లభించిన హక్కుల పునరుద్ధరణ, నూతన వేజ్ బోర్డు ఏర్పాటు, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, క్యాష్‌లెస్ వైద్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్