మేడారంలో ఆదివారం భక్తులు భారీగా వనదేవతలను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహించిన భక్తులు రోడ్డుపై బైఠాయించి ఆర్టీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పిల్లలతో చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్నామని, ఇంతవరకు బస్సులు రాలేదని వాపోయారు. దీంతో మేడారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.