ములుగు జిల్లాలో సేంద్రియ రైతు బజార్‌ను నిర్వహిస్తున్న బృందాన్ని మంత్రి సీతక్క అభినందించారు. రసాయనాలతో పండిస్తున్న ఆహార పదార్థాలు అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని, సేంద్రియ పంటల ద్వారా ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించడం అభినందనీయమని, ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి సేంద్రియ స్టాల్‌లను సందర్శించాలని మంత్రి కోరారు.