ములుగు జిల్లా మేడారం జంపన్న వాగు వద్ద సంక్రాంతి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో తప్పిపోయిన ఓ పాపను మంత్రి సీతక్క అక్కున చేర్చుకున్నారు. పాప తల్లిదండ్రులు పోలీస్ కంట్రోల్ రూంలో సంప్రదించాలని ఆమె కోరారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు జాతరలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.