ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈక తిరుపతి–స్వప్న దంపతుల ఆరు నెలల కుమారుడు మంచంలో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. పాము కాటువేసి వెళ్లే క్రమంలో తల్లి గుర్తించినట్లు సమాచారం. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, 108 అంబులెన్స్ కోసం ఆలస్యం కావడంతో దంపతులు బాలుడిని తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. చిన్నారి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.