ములుగు జిల్లా జాకారం TGSWRJCలో 70వ SGFI ఆధ్వర్యంలో సోమవారం అండర్-14, అండర్-17 బాలబాలికలకు కో-కో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడల్లో టోర్నమెంట్ కం సెలక్షన్స్ నిర్వహించారు. ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, జిల్లా కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు కుంజ సూర్య పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు చదువుతో పాటు క్రీడలే కీలకం అని ఆమె పేర్కొన్నారు.