తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులను అడిగి భక్తుల ఇబ్బందులను తెలుసుకున్నారు.