తాడ్వాయి: త్రుటిలో తప్పిన ప్రమాదం

1చూసినవారు
ములుగు జిల్లాలో తాడ్వాయి మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ ఆర్చి సమీపంలో ముందు వెళుతున్న ఇసుక లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేసి, రివర్స్ గేర్ వేసుకొని వేగంగా వచ్చి వెనుక ఉన్న ఎలక్ట్రిక్ బస్సును ఢీకొంది. బస్సు డ్రైవర్ హారన్ కొడుతున్నా లారీ డ్రైవర్ వినిపించుకోలేదని ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనలో బస్సు ముందు అద్దం ధ్వంసమైనప్పటికీ, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్