ములుగు జిల్లా
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు, జంగాలపల్లి కాసిందేవుపేట గ్రామాభివృద్ధికి సర్పంచ్ పి. నిరోషా అమర్ సింగ్, ఉపసర్పంచ్ సుదర్శన్, పాలకవర్గం చేస్తున్న కృషిని అభినందించారు. శుక్రవారం ములుగు జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించి, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లాయర్ వినయ్ కుమార్, వార్డు సభ్యులు,
బీఆర్ఎస్ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.