ములుగులో గులాబీ జెండా ఎగరాలి.. బడే నాగజ్యోతి

1చూసినవారు
ములుగులో గులాబీ జెండా ఎగరాలి.. బడే నాగజ్యోతి
ములుగు జిల్లా కేంద్రంలో BRS పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ములుగు ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, నియోజకవర్గ పెండింగ్ సమస్యలపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని బీఆర్‌ఎస్ ములుగు ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. 22ఏ పేరుతో భూముల సమస్యపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి, యువతను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలని నాగజ్యోతి అన్నారు.

సంబంధిత పోస్ట్