ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామ సర్పంచ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మొత్తం 14 వార్డులను కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 4, బీజేపీ 3 చొప్పున పంచుకున్నాయి. ఉప సర్పంచ్ పదవిని బీఆర్ఎస్ కు కేటాయించారు. రాజకీయాల్లో నిత్యం పోటీపడే ఈ మూడు పార్టీలు స్థానిక ఎన్నికల్లో స్నేహపూర్వకంగా వ్యవహరించడం విశేషం. పదవుల పంపకంలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని ఈ సంఘటన నిరూపించింది.