ములుగులో గణేష్ శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇప్పటివరకు 815 గణేష్ విగ్రహాలను ఆన్లైన్లో నమోదు చేసి
జియో ట్యాగింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిమజ్జన వేడుకల్లో డీజేలకు పూర్తిగా నిషేధం విధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ హెచ్చరించారు.