మేడారంలో నేడు తిరుగువారం పండుగ

8చూసినవారు
ములుగు జిల్లా మేడారం లో నేడు బుధవారం తిరుగువారం పండుగను పూజారులు నిర్వహించనున్నారు. మహా జాతర ముగిసిన తరువాత వచ్చే మొదటి బుధవారం రోజున ఈ పండుగ నిర్వహించడం ఆనవాయితీ. మేడారం లోని సమ్మక్క, సారక్క ఆలయాలను శుద్ది చేసి, దీప ధూపాలు వెలిగించి, పూజా సామాగ్రిని ఆలయాల్లో భద్రపరుస్తారు. అనంతరం యాట బోతులను బలిచ్చి, కుటుంబ సభ్యులతో గ్రామ పొలిమేరలో వన భోజనాలు చేయడంతో తిరుగువారం పండుగ ముగుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్