ములుగులో విషాదం.. క్వారీలో జారిపడి కూలీ మృతి

2చూసినవారు
ములుగులో విషాదం.. క్వారీలో జారిపడి కూలీ మృతి
ములుగు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని జిఎంఆర్ రాక్ సాండ్ లో బుధవారం క్వారీలో ప్రమాదం జరిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన కూలీ దంబర్ సంటూ (35) కాలు జారి ఎత్తు నుంచి బండరాళ్లపై పడటంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. సహచరులు అతన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you