మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా, నేడు సమ్మక్క తల్లి చిలుకల గుట్ట నుండి గద్దెల వద్దకు చేరుకోనుంది. సమ్మక్క రాక సందర్భంగా, ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించిన వెదురు కర్రలను (వనం) గద్దెపై ప్రతిష్టించారు. జాతరలో వెదురుకు విశిష్ట స్థానం ఉంది. అనంతరం చిలుకల గుట్ట నుండి సమ్మక్కను తీసుకువస్తారు.