వెంకటాపూర్: 35 అడుగులకు చేరిన రామప్ప నీటిమట్టం

15చూసినవారు
వెంకటాపూర్: 35 అడుగులకు చేరిన రామప్ప నీటిమట్టం
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప సరస్సు నీటిమట్టం ఆదివారం 35 అడుగులకు చేరింది. రెండు రోజులుగా ములుగు జిల్లాలో 'మొంథా' తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా సరస్సులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సరస్సు పూర్తి నీటిమట్టం 36 అడుగులు కాగా, 35 అడుగులకే అలుగు పారడం ప్రారంభమైంది. దీంతో ఆయకట్టు రైతులు రెండు పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :