ములుగు: పంట నష్టపరిహారం చెల్లిస్తాం: మంత్రి సీతక్క

68చూసినవారు
ములుగు: పంట నష్టపరిహారం చెల్లిస్తాం: మంత్రి సీతక్క
అకాల వర్షం కారణంగా పలు రకాల పంటలను కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని శనివారం మంత్రి సీతక్క అన్నారు. గోవిందరావుపేట మండలం దుంపలగూడెం గ్రామంలో రైతులు, వర్ష బాధిత కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇటీవల పలు మండలాల్లో అకాల వర్షం కారణంగా నోటి కాడికి వచ్చిన పంట దెబ్బతినడం బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్