ముగ్గులు (పట్నాలు) వేసి అమ్మవార్లకు స్వాగతం

7చూసినవారు
మేడారం జాతరలో భక్తులు చిలకల గుట్ట నుండి సమ్మక్క రాక సందర్భంగా దారి వెంట రంగు రంగుల ముగ్గులు (పట్నాలు) వేసి అమ్మవార్లకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకున్న తర్వాత ఓడి బియ్యం, బంగారం (బెల్లం), కొబ్బరి కాయలు సమర్పిస్తారు. వనదేవతలకు ఇలా పూజలు నిర్వహించడం వల్ల తాము కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ జాతర భక్తిశ్రద్ధలకు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్