ములుగులో ద్విచక్ర వాహనాల ఢీ.. కార్మికుడు మృతి

3చూసినవారు
ములుగులో ద్విచక్ర వాహనాల ఢీ.. కార్మికుడు మృతి
ములుగు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన భుకామ్ బాక్ (45) అనే కార్మికుడు మృతి చెందాడు. ములుగు మండలం అబ్బాపురం గ్రామ శివారులోని రైస్ మిల్లులో పనిచేస్తున్న బాక్, సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా జాకారం క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బాక్ అక్కడికక్కడే మరణించగా, ఎదురుగా వచ్చిన వాహనంలో ఉన్న పొట్ల కుమారస్వామి, అతని భార్య (మాజీ సర్పంచి) నీలమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్