ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగులోని జాకారంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మందుచ్చుల కథా గానం ఘనంగా జరుగుతోంది. అంతరించిపోతున్న ఈ ప్రాచీన కళను కాపాడేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. జవనిక వాయిద్యంతో కాటమరాజు వీరగాథలను మందుచ్చులు ఆలపిస్తుండటంతో భక్తులు ఆనందిస్తున్నారు. కుల చరిత్ర, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలనే సంఘం కృషిని స్థానికులు ప్రశంసిస్తున్నారు.