నర్సంపేట - Tamil_Nadu

ఖానాపురం: ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఏసిపి

ఖానాపురం: ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఏసిపి

వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో బుధవారం జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం ఖానాపురం, బుధరావుపేట గ్రామాలలో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసులచే కవాతు నిర్వహించారు. ఎన్నికలు జరగనున్న 20 గ్రామాల్లో ఇద్దరు సిఐలు, పదిమంది ఎస్సైలు, 123 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని, విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసిపి హెచ్చరించారు. బుధరావుపేటలో పోలీసుల కవాతును అడిషనల్ డిసిపి ప్రభాకర్ రావు పరిశీలించి సూచనలు చేశారు.

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా