వరంగల్ ఉర్సు గుట్ట పోలీస్ సిగ్నల్ క్రాస్ సమీపంలోని రేవతి చికెన్ సెంటర్ షాప్ వద్ద వీధి కుక్కలు మాంసాహారం తినడంపై సమాచార హక్కు చైతన్య సమితి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. షాప్ యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ పరిస్థితి ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతుందని పేర్కొన్న సమితి సభ్యులు, వరంగల్ మున్సిపాలిటీ పర్యవేక్షణ అధికారి తక్షణమే స్పందించి షాప్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.