శాంతియుత వాతావరణంలో బక్రీద్: డిసిపి

5చూసినవారు
శాంతియుత వాతావరణంలో బక్రీద్: డిసిపి
వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్ స్టేషన్లో ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ, బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, సామరస్యంగా వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, దుగ్గొండి సీఐ సాయిరామన్న, నల్లబెల్లి, ఖానాపూర్, నర్సంపేట ఎస్సైలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్